Monday, November 25, 2024

30 వరకు అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

Up to 30 applications for Ambedkar Overseas Scheme

 

మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద ఎస్‌టి విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి ఈ నెల 30 దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.20 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్,జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాలలోని విశ్వవిద్యాలయాలలో పిజి ఆ పై చదువు చదువాలనుకున్న వారకి ఈ పథకం కింద రూ.20 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. వీసా ఫీజు, ఒకవైపు విమాన ప్రయాణ ఛార్జీలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండి, జులై 1,2021 నాటికి 35 సంవత్సరాలకు మించకుండా ఉన్న విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అర్హత గల విద్యార్థులు ఈ నెల 30లోగా http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News