Wednesday, January 22, 2025

మోసగాడి వలకు చిక్కుకున్న లేడీ పోలీస్ ఆఫీసర్!

- Advertisement -
- Advertisement -

ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్. డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ అని పేరు తెచ్చుకున్నారు. అభిమానులు ఆమెను లేడీ సింగంగా పిలుచుకుంటారు. ఆమె పేరు చెబితేనే నేరస్థులకు వెన్నులో వణుకు పడుతుంది. ఆమె పేరు శ్రేష్ఠా ఠాకూర్. 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన శ్రేష్ఠ ఘజియాబాద్ లో డిఎస్పీగా పనిచేస్తున్నారు.

ఇంత గొప్ప పోలీస్  ఆఫీసర్ అయిన శ్రేష్ఠ విచిత్రమైన పరిస్థితుల్లో ఓ మోసగాడి వలలో చిక్కుకున్నారు. ఓ మాట్రిమోనియల్ వెబ్ సైట్ లో రోహిత్ రాజ్ అనే వ్యక్తిని చూసి ఇష్టపడ్డారు. తాను 2008 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్ని అనీ, రాంచీలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నాననీ రోహిత్ రాజ్ చెప్పాడు. దాంతో అతన్ని శ్రేష్ఠ 2018లో పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లయిన కొన్నాళ్లకే తన భర్త ఒక మోసగాడని తెలిసి శ్రేష్ఠ ఆశ్చర్యపోయారు.

నిజానికి రాంచీలో రోహిత్ రాజ్ అనే ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారు. కానీ ఆయన శ్రేష్ఠ భర్త కాదు. అంటే, సదరు ఆఫీసర్ని తానేననని చెప్పుకుని మోసం చేశాడన్నమాట. అతనితో సర్దుకుపోదామని శ్రేష్ఠ అనుకున్నా, నకిలీ రోహిత్ రాజ్ ఆమె పేరు చెప్పి దంధా చేయడం మొదలుపెట్టాడు. దాంతో శ్రేష్ఠ ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కు నెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News