Friday, December 20, 2024

వరకట్న వేధింపులు.. యాసిడ్ తాగించి..

- Advertisement -
- Advertisement -

UP woman dies after in-laws force her to drink acid

ముజఫర్ నగర్ : సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో వరకట్న సమస్య ఒకటి. నాగరిక సమాజంలో వరకట్న వేధింపులతో మహిళలు ప్రాణాలు గాల్లో దీపాల లాగా మారాయి. అడిగినంత కట్నం డబ్బులు తీసుకురాలేదన్న కారణంతో భర్త, అత్త బలవంతంగా యాసిడ్ తాగించి ఓ మహిళ మృతికి కారణమయ్యారు. ఈ ఘటన యూపి లోని ముజఫర్ నగర్ న్యూ మండీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలిని రేష్మగా గుర్తించారు. బలవంతంగా యాసిడ్ తాగించడం వల్లనే రేష్మ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వరకట్నం తీసుకురావాలని రేష్మను అత్తమామలు వేధింపులకు గురిచేసేవారని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News