Saturday, November 23, 2024

లేచిపోయిన ప్రేమజంట… యువకుడి తల్లిని నగ్నంగా ఊరేగించారు…

- Advertisement -
- Advertisement -

UP Woman paraded naked in Rampur

లక్నో: ప్రేమించిన యువతితో యువకుడు పారిపోవడంతో అతడి తల్లిపై దాడి చేయడమే కాకుండా ఆమెను నగ్నంగా ఊరేగించిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మిలాక్ తహ్సీల్ ప్రాంతంలోని కరీమ్‌గంజ్ గ్రామంలో యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ప్రేమజంట కలుసుకోవడానికి వీల్లేదని పెద్దలు హెచ్చరించారు. శుక్రవారం రాత్రి సమయంలో ప్రేమజంట గ్రామం నుంచి పారిపోయింది. కోపంతో ఊగిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటికి వచ్చి… అతడి తల్లిపై దాడి చేశారు. అనంతరం ఆమెను నగ్నంగా ఊరేగించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. మైనర్ కూతురిని ఆమె కుమారుడు తీసుకెళ్లడంతోనే దాడి చేశానని తెలిపాడు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News