Friday, December 20, 2024

కోడలిని లైంగికంగా వేధిస్తుండడంతో భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

లక్నో: కోడలిని లైంగికంగా వేధిస్తుండడంతో భర్తను భార్య గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బడౌన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తేజేందర్(43), మితిలేష్ దేవ్ అనే దంపతులు నివసిస్తున్నారు. తేజేందర్‌కు తన కోడలిపై మనసు పడింది. తన కోడలని లైంగికంగా వేధించడం మొదలు పెట్టడంతో భార్య గ్రహించింది. తనతోనే కోడలు నిద్రపోవాలని భార్యను బలవంతం పెట్టేవాడు అతడు వేధింపులు బరించలేక చంపాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14న తేజేందర్ ఒంటరిగా నిద్రపోతుండడంతో మితిలేష్ గమనించింది. వెంటనే గొడ్డలి తీసుకొని గొంతుపై నరికింది. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను హత్య చేశారని చెప్పుకొచ్చింది. విచారణలో పోలీసులకు అనుమానాలు రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News