Friday, December 20, 2024

యువతిని హత్య చేసి.. చెరకు తోటలో…

- Advertisement -
- Advertisement -

UP Young Woman body chopped off after murdered

బలరాంపూర్(యూపీ): 18 ఏళ్ల యువతి హత్యకు గురికావడమే కాక, ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి చెరకు తోటలో పారేసిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్ బలరాంపూర్‌లో జరిగింది. పోలీసులు ఆదివారం ఈ సంఘటన వివరాలు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి 20 ఏళ్ల యువకుడు సంతోష్ వర్మను అరెస్టు చేశారు. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6 నుంచి ఈ యువతి కనిపించలేదు. అయితే ఆమె మృతదేహం చెరకుతోటలో కుళ్లిపోయిన స్థితిలో ఉందని శనివారం కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆమె కాలి స్లిప్పర్లు, దుస్తుల బట్టి తండ్రి ఆమెను గుర్తించారు. ఆమె ఆనవాలు గుర్తు లేకుండా ఉండడానికి ఆమె శరీరంపై యాసిడ్ పోసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు పంపామని ఎస్‌పి కుమార్ సక్సేనా చెప్పారు.

UP Young Woman body chopped off after murdered

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News