Wednesday, January 22, 2025

దుబాయ్‌లో ఉపాస‌న‌, చ‌ర‌ణ్ దంప‌తుల బేబి ష‌వ‌ర్ సెలబ్రేషన్స్

- Advertisement -
- Advertisement -

ఉపాస‌న కామినేని కొణిదెల ఈ స‌మాజం బాగుండాలంటూ దాతృత్వం కోసం పిలుపునిచ్చే వ్య‌క్తుల్లో ఎప్పుడూ ముందుటారనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ వారాంతంలో ఆమె త‌న భ‌ర్త గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి దుబాయ్‌లో బేబీ షవ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర‌మంలో వారి ద‌గ్గ‌రి స్నేహితులు, కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు.

ఈ వేడుక‌లో చ‌ర‌ణ్‌, ఉపాస‌న జంట చూడ ముచ్చ‌ట‌గా అనిపించారు. ఉపాస‌నకు ఎల‌ప్పుడు మ‌ద్ధ‌తు అందించే ఆమె సోద‌రి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని అద్భుతంగా నిర్వ‌హించారు. ఇవి వారికి మ‌రుపురాని క్ష‌ణాలుగా చెప్పవచ్చు. ఉపాస‌న అమ్మ‌మ్మ ఈ వేడుక‌లో హుందాగా క‌నిపించి అంద‌రి హృద‌యాల‌ను దోచుకున్నారు.
ఉపాస‌న‌.. రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి జ‌రుపుకున్న ఈ వేడుక‌ల‌కు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Upasana and charan celebrated intimate baby shower in dubaiఇప్ప‌టి వ‌ర‌కు ఉపాస‌న మాతృత్వ ప్రయాణం అనేది ..ఓ వైపు ప‌ని చేసుకుంటూనే త‌మ‌ కుటుంబాల‌ను చ‌క్క‌గా చూసుకునే చాలా మంది మ‌హిళ‌ల‌కు సూర్ఫిదాయ‌కం. తాము చేసే ప‌నితో పాటు జీవితాన్ని ఎలా స‌మ‌తుల్యం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించే మ‌హిళ‌ల్లో ఆమె ప్ర‌యాణం ఓ రోల్ మోడ‌ల్‌గా ఉత్తేజాన్ని నింపుతుంది. ఒక వైపు మాతృత్వంలోని ఆనంద క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తూనే మ‌హిళ‌లు వారి క‌ల‌ల‌ను సాధించే దిశగా అడుగులు వేయాల‌ని ప్రోత్స‌హిస్తుంటారు ఉపాస‌న‌.ఈ క్ర‌మంలో ఆమె అపోలో హాస్పిటల్స్‌లో సీఎస్ఆర్‌ వైస్ చైర్‌పర్సన్‌గా , యువ‌ర్ లైఫ్ వ్య‌వ‌స్థాప‌కురాలిగా దాతృత్వాన్ని కొన‌సాగిస్తూనే స‌మాజంలో బాగు కోసం అంచ‌చ‌ల‌మైన నిబ‌ద్ధ‌త‌ను చూపించారు.

సమాజంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న కామినేని కొణిదెల జంట‌ చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలుస్తున్నారు. త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులుగా మారబోతున్న వీరి కొత్త ప్ర‌యాణం చాలా గొప్ప‌గా ఉంటుంద‌నటంలో సందేహం లేదు. ఈ అందమైన ప్రయాణాన్ని కలిసి ప్రారంభించిన ఈ జంటకు ప్రేమ, ఆనందం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాల‌ని మేం కోరుకుంటున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News