Wednesday, January 22, 2025

రూమర్స్ కు చెక్ పెట్టిన ఉపాసన.. బేబీ బంప్ పిక్స్ వైరల్

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కనబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలకు ఉపాసన చెక్ పెట్టింది.

ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన దంపతులు థాయ్ లాండ్ లో జరుగుతున్న ఫ్యామిలీ పార్టీలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో ఉపాసన బేబి బంప్ తో కనిపిస్తుంది. దీంతో సరోగసి ద్వారా బిడ్డను కనబోతున్నట్లు వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లైంది.కాగా, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News