Wednesday, January 22, 2025

ఉపాసన ఇంట్లో విషాదం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరు తనయుడు నటుడు రాంచరణ్‌కు ఉపాసనకు పెళ్లి జరిగి పది సంవత్సరాలు అవుతుంది. ఉపాసన తన గర్భంతో ఉన్నానని చెప్పడంతో కామినేని కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు సంతోషానికి హద్దులు లేకుండాపోయాయి. ఆమె ప్రెగ్నెంట్ అయినప్పడి నుంచి రామ్‌చరణ్ ఇంట్లో శుభాలు నెలకొన్నాయి. రామ్‌చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. మెగా కుటుంబం సంతోషంగా ఉన్న సమయంలో ఉపాసన పుట్టింట్లో విషాదం నెలకొంది. తన గ్రాండ్ మదర్ పుష్నాన్ని చనిపోయిందని ఉపాసన తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేస్తూ ఉపాసన పేర్కొంది. చివరిచూపు వరకు ప్రేమ, కృతజ్ఞత, గౌరవ ప్రదంగా జీవనం సాగించిందన్నారు. పుష్నాన్ని తనని పెంచి పెద్ద చేయడంతో ఆమె పంచిన ప్రేమ ఎప్పటికి మరువలేనని తెలిపింది. గ్రాండ్ పేరెంట్స్ ఎంత ప్రేమ పొందానో ఆ ప్రేమానురాగాలను తన పిల్లలకు అందిస్తానని చెప్పింది. ఆత్మకు శాంతి చేకూరాలంటూ తాను పోస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News