Monday, January 20, 2025

థియేటర్లో ఉపాసన హంగామా !

- Advertisement -
- Advertisement -

Upasana

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన థియేటర్‌లో సందడి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదుచూసిన భారీ పాన్ ఇండియా సినిమా ’ఆర్ఆర్ఆర్‘ నేడు  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్ టిఆర్  హీరోలు కావడంతో  మెగా – నందమూరి అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రేక్షకులు కూడా స్పెషల్ షోస్, ప్రీమియర్ షోస్ నుంచే థియేటర్స్ వద్ద చేస్తున్న సందడి, రచ్చా మామూలుగా లేదు.

ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి హీరోలు తారక్, చరణ్ కుటుంబ సమేతంగా స్పెషల్ షోను చూశారు. ఈ సమయంలో చరణ్ భార్య ఉపాసన అభిమానులతో కలిసి థియేటర్‌లో నానా హంగామా చేశారు. చరణ్ పోషించిన సీతారామరాజు పాత్ర స్క్రీన్ మీద కనిపించిన ప్రతీసారి పేపర్లు విసిరి అరుపులు కేకలతో నానా అల్లరి చేశారు. దాంతో అభిమానులలో ఉత్సాహం రెట్టింపు అయింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ వేళ ఉపాసన భర్త అభిమానిగా మారడం..థియేటర్‌లో సందడి చేయడంతో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News