గురువారం 487 కేంద్రాల్లో 20,636 మందికి వ్యాక్సిన్, ముగ్గురికి స్వల్ప రియాక్షన్లు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,51,243 ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. అతి త్వరలో కొవిన్‌లో నమోదైన మి గతా వారికి కూడా టీకా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా గురువారం 487 సెం టర్లలో 45,973 మందికి టీకా ఇవ్వాలని అధికారులు లక్షం పెట్టుకోగా, కేవలం 20,636 మంది టీకా తీసుకున్నట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే వీరిలో ముగ్గురికి మైనర్ రియాక్షన్లు వచ్చాయని, వారంతా సురక్షితంగా ఉన్నారని ఆయన తెలిపారు. అయితే ఈ రోజు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ సెంటర్లలో వ్యాక్సినేషన్ మందకొడిగా జరుగుతుందని అధికారులు అంటున్నారు. గవర్నమెంట్ సిబ్బంది కంటే ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్లు వెనకడుగు వేయడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వసెక్టార్ కంటే ప్రైవేట్‌లోనే అధిక వ్యాక్సినేషన్ శాతం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్లు టీకాపై ఆసక్తి లేనట్లు సర్కార్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
టీకా తీసుకున్న ఆస్టర్ ప్రైమ్ సిఇ కెటి దేవానంద్, మెగా కోడలు ఉపాసన
టీకాపై అపోహలను తొలగించేందుకు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సిఇఓ కెటి దేవానంద్ గురువారం టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు చీఫ్ మెడికల్ మెడికల్ సర్వీసెస్ అధికారిణి డా సి ఉమాదేవి, ఇతర వైద్యులు, నర్సులు, పారమెడికల్ సిబ్బంది ఉన్నారు. దీంతో పాటు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన కొణిదెల టీకా తీసుకున్నారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌పై ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది చాలా సురక్షితమన్నారు. పౌరులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు.
To put an end to the fear of vaccination, @UpasanaKonidela took the initiative & gets herself vaccinated today at Apollo.
She also suggested all the citizens to get vaccinated without any hesitation. #COVIDVaccination pic.twitter.com/5w7zer0Kfw
— BA Raju's Team (@baraju_SuperHit) January 28, 2021
Upasana Konidela taken Covid 19 Vaccinated