Sunday, January 19, 2025

ప్రతిష్టాత్మక పురస్కారం పొందిన ఉపాసన కొణిదెల

- Advertisement -
- Advertisement -

Upasana Konidela won prestigious Not Health CSR Award

సెలబ్రిటీ హోదా సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. మన సొసైటీకే కాదు పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. హ్యూమన్ లైప్ తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలను ఆపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్  వైస్ ఛైర్ పర్సన్ గా కొనసాగిస్తున్న ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఆమె ఈ పురస్కారాన్నిఅందుకోనున్నారు. ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తాతయ్య అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని ఉపాసన కొణిదెల ఈ సందర్భంగా అన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనే ఆయన లక్ష్యమే తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె చెప్పారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా..సతీమణి ఉపాసన తన కెరీర్ లో భర్త గర్వించే పురస్కారాలు అందుకోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News