Thursday, January 16, 2025

వచ్చే వారంలో రిలీజ్ కానున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

- Advertisement -
- Advertisement -

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే..కొన్ని రోజులు కాస్త ఓపిక పట్టండి. ఈవారం మార్కెట్లో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. అవి మీ అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా గొప్ప ఎంపికగా ఉండొచ్చు. Samsung, Realme, OnePlus వంటి పెద్ద కంపెనీలు తమ కొత్త మోడల్‌లను మార్కెట్లో విడుదల చేయబోతున్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Realme GT 6

ఈ ఫోన్ జూన్ 20న మార్కెట్లో విడుదల కానుంది. దీని ధర సుమారు రూ. 20 వేలు ఉండొచ్చు. పనితీరు కోసం..ఫోన్‌లో Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌సెట్ మార్చారు. అంతేకాకుండా ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అద్భుతమైన ఫోటోలు తీయడానికి 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

OnePlus Nord CE4 Lite

ఈ ఫోన్ జూన్ 18, 2024న మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఫోన్ కూడా 20 వేల రూపాయలకే అందుబాటులోకి రానుంది. ఇది 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. పనితీరు కోసం..ఫోన్‌లో Qualcomm Snapdragon 6s చిప్‌సెట్ ని అమర్చారు. అందమైన ఫోటోలు తీయడానికి 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000mah బ్యాటరీని కలిగి ఉంటుంది.

Motorola Edge 50 Ultra

ఈ ఫోన్ జూన్ 18, 2024న మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ దాదాపు రూ. 20 వేల ధరకే వచ్చే అవకాశం ఉంది. ఇది 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. పనితీరు కోసం ఫోన్‌లో Qualcomm Snapdragon 6s చిప్‌సెట్ కలిగి ఉంది.అందమైన ఫోటోలు తీయడానికి 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరాఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000mAh కలిగి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News