Monday, April 14, 2025

ఫ్యామిలీ సెంట్‌మెంట్‌తో ఎమోషనల్ పాత్రలో..

- Advertisement -
- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ యాక్షన్ అండ్ ఎమోషన్‌లో డ్రామాలోని ఫ్లాష్ బ్యాక్ పై ఇప్పుడు ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో బాలయ్య రెగ్యులర్ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుందని, ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఇప్పటికే వారణాసి పరిసర ప్రాంతాల్లో అఘోరాలతో యాక్షన్ ఎపిసోడ్ ను ఇటీవలే చిత్రీకరించినట్లు తెలిసింది. దీని ప్రకారం అఖండ 2 షూటింగ్‌ని మేకర్స్ పక్కా ప్లానింగ్‌గా పూర్తి చేస్తున్నారు.

ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నారు. హిమాలయాల్లో ఇంతవరకు ఎవరూ చూపించని సరికొత్త లొకేషన్లలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను, – బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. బాలయ్య సినిమా కోసం ఇప్పటికే తమన్ సంగీతపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News