Monday, December 23, 2024

‘కబ్జా’ విశేషాలను పంచుకున్న ఉపేంద్ర, శ్రియా

- Advertisement -
- Advertisement -

ఐఎండీబీ ఒరిజినల్ సిరీస్ అయిన ‘ఆస్క్ ఈచ్ అదర్ ఎనీథింగ్’ అభిమానులను తమ అభిమాన సెలబ్రిటీలకు మరింత దగ్గరయ్యేలా చేస్తుంది. ఈ సిరీస్ లో వారు తమ జీవితాల గురించి తమ సినీ జీవితంలోని అనుభవాలను, వారి ప్రాజెక్టుల్లోని కొన్ని ఆసక్తికరమైన షూటింగ్ సమయంలోని విశేషాలను అభిమానులతో పంచుకుంటారు! దీనిలో భాగంగా కన్నడ చిత్రం కబ్జా విడుదలకు ముందు, ఉపేంద్ర, శ్రియా శరణ్ కలిసి వారి సినిమా షూటింగ్ అనుభవాలను, ఒకరికొకరు మొదటి సారి కలిసి నటించిన విశేషాలను పంచుకున్నారు.

ఉపేంద్రతో తొలిసారి కలిసి నటించడం గురించి శ్రియ మాట్లాడుతూ “నేను మొదటిసారి ఆయన్ని కలిసినప్పుడు ‘నమామి నమామి’ అనే పాటను చిత్రీకరిస్తున్నాం. దీన్ని చిన్ని సర్ అందంగా కొరియోగ్రఫీ చేశారు. ఉపేంద్ర సార్ సెట్ కు వస్తున్నారని, చిత్రబృందం చెప్పడంతో చుట్టుపక్కల వారంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. నేను ఆ సమయంలో డ్యాన్స్ స్టెప్పులు నేర్చుకుంటున్న, హఠాత్తుగా ఆయన లోపలికి వచ్చారు. నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా ఆయన పాటకు సంబంధించిన రాజు వేషంలో రాజులగా కనిపించాడు. చుట్టుపక్కల అందరూ చాలా నిశ్శబ్దంగా, సీరియస్ గా ఉన్నప్పటికీ ఆయన నవ్వుతూ ఉన్నాడు. పెద్ద చిరునవ్వుతో లోపలికి నడిచి నవ్వులు పూయించాడు. ఆయన సూపర్ స్టార్ కానీ అలా వుండరు సింపుల్ గా తన సినిమా సెట్ లో అందరిని ప్రేమిస్తూ అందరితో మంచి సమయాన్ని గడుపుతారు. అయనికి ప్రశంసలంటే నచ్చదు కానీ, ఇతరులను సులభంగా ప్రసంసిస్తారు అదే ఆయనలోని గొప్పతనాన్ని చెబుతుంది.”

దీంతో ఉపేంద్ర శ్రియను పొగడటం మొదలుపెట్టాడు. “మీరు ఈ సినిమా చేస్తున్నారని వినగానే వావ్ అనుకున్నాను! ఒక కల నిజమైంది. గతంలో రెండు, మూడు సినిమాల కోసం మిమ్మల్ని సంప్రదించాను. కానీ, మీరు చాలా హిందీ, తెలుగు, మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారని” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News