Thursday, January 23, 2025

యూత్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా

- Advertisement -
- Advertisement -

కంచర్ల ఉపేంద్ర హీరోగా సావిత్రి కృష్ణ హీరోయిన్ గా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ‘ఉపేంద్ర గాడి అడ్డా‘ చిత్రం హైదరాబాద్ లో ఆరంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ నివ్వగా, అతిధిగా విచ్చేసిన నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచాన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ “హీరోగా నటిస్తున్న మా అబ్బాయితో వరుసగా తొమ్మిది సినిమాలు తీయాలని సంకల్పించాం. ఇప్పటికే నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇది మా బ్యానర్ లో ఐదవ సినిమా. చక్కటి కమర్షియల్ అంశాలతో కూడుకున్న మాస్ సినిమా ఇది” అని అన్నారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు యూత్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News