Thursday, January 23, 2025

రెగ్యులర్ షూటింగ్ లో “ఉపేంద్ర గాడి అడ్డా”

- Advertisement -
కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న “ఉపేంద్ర గాడి అడ్డా” చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లోని వివిధ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు తెలియజేస్తూ, “ప్రస్తుతం హీరో హీరోయిన్ ల మీద సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
షూటింగ్ మొత్తం పూర్తయ్యేవరకు సింగిల్ షెడ్యూల్ జరుపుతున్నాం. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. వాటి రికార్డింగ్ జరుగుతోంది” అని అన్నారు.  దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, “చక్కటి కమర్షియల్ అంశాలతో కూడుకున్న మాస్ సినిమా ఇది.  ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. హీరో పాత్ర పక్కా మాస్ అయితే హీరోయిన్ పాత్ర బాగా డబ్బున్న అమ్మాయిగా ఉంటుంది” అని చెప్పారు.  హీరో కంచర్ల ఉపేంద్ర, హీరోయిన్ సావిత్రి కృష్ణ మాట్లాడుతూ, “నటించడానికి ఎంతో అవకాశం ఉన్న పాత్రలను పోషిస్తున్నాం. కెరీర్ ను మలుపు తిప్పే చిత్రమవుతుంది” అని అన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News