పాట్నా: అసంతృప్తితో ఉన్న జెడి(యు) నాయకుడు ఉపేంద్ర కుష్వాహ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ‘రాష్ట్రీయ లోక్ జనతాదళ్ ’ అనే కొత్త పార్టీని ప్రారంభించారు. విలేకరుల సమావేశంలో ప్రకటన చేస్తూ కుష్వాహ తన సభ్యత్వాన్ని వదులుకోడానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌తో అపాయింట్‌మెంట్ కోరుతానని అన్నారు. అయితే మాజీ కేంద్ర మంత్రి అయిన ఆయన ఎన్‌డిఏతో పొత్తుపెట్టుకునే అంశాన్ని రహస్యంగానే ఉంచారు. ‘మా పెద్దన్న , ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను, ఆర్జెడితో విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేసిన ఆయన కొన్ని గంటల తర్వాత కొత్త ప్రభుత్వాన్ని(బిజెపితో) ఏర్పాటు చేశారు’ అన్నారు.
నితీశ్ కుమార్ తన రాజకీయ మూలధనాన్ని ‘తాకట్టు’ పెట్టారు, ఆర్‌జెడికి చెందిన తేజస్వి యాదవ్‌ను ఉపముఖ్యమంత్రిగా ప్రకటించారని కుష్వాహ ఆవేదన వ్యక్తం చేశారు. కుష్వాహ తన ‘రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ’ని 2021లో జెడి(యు)లో కలిపేసి ఆ పార్టీలోకి తిరిగొచ్చారు.