Sunday, December 22, 2024

రెండు క్వింటాళ్ళ గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

టేకులపల్లి : అక్రమంగా కారులో తరలిస్తున్న సుమారు రెండు క్వింటాళ్ళ ముప్పైకేజీల గంజాయిని టేకులపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు ఇల్లెందు డియస్పి రమణమూర్తి స్థానిక టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజమాబాద్ జిల్లా ఏరుగట్లకు చెందిన ననుబాలసురేష్ చదువుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటుపడిన అతను డబ్బులకోసం ప్రయత్నిస్తుండగా చార్మినార్ ఏరియాకు చెందిన సంతోష్ పరిచయమయ్యాడు.

తన జల్సాలకు అప్ఫుగా నగదు కావలని అడిగితే తను చెప్పిన పనిచేస్తే లక్ష రూపాయలు ఇస్తానని తెలిపాడు. దీంతో డబ్బుకు ఆశపడి గంజాయి తీసుకువచ్చేందుకు తన డ్రైవింగ్ లైసెన్స్‌ద్వారా ఆన్‌లైన్‌లో కారును సెల్ఫ్ డ్రైవ్‌కు అద్దెకు తీసుకుని సీలేరు వెళ్ళాడు. అక్కడ మణికంఠ అనే వ్యక్తిని కలసి అతని ద్వారా కారులో సుమారు 104 గంజాయి ప్యాకెట్లు సుమారు 2 క్వింటాళ్ల 30 కేజిలను హైదరాబాద్‌కు తరలించేందుకు ఈ నెల 9న బయలు దేరాడు. కాగా సోమవారం మండల కేంద్రంలోని తడికెలపూడి క్రాస్‌రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను గమనించి వారి నుంచి తప్పించుకునేందుకు వేగంగా కారును తిప్పడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన చేలోకి దూసుకుపోయింది.

అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వెంటనే కారును అందులో వున్న గంజాయిని స్వాధీనం చేసుకుని సురేష్‌ను అరెస్టు చేశారు. కాగా పట్టుకున్న గంజాయి విలువ సుమారు 46 లక్షలపై చిలుకు వుంటుందని డియస్పి తెలిపారు. ఈ సమావేశంలో టేకులపల్లి సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ రమణారెడ్డి, ఏయస్‌ఐ కృష్ణనాయక్, సిబ్బంది సురేష్, రమణ, కృష్ణ ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News