Monday, December 23, 2024

భారత్ యుపిఐ, సింగపూర్ పేనౌతో లింక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యుపిఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) త్వరలో నగదును వదిలివేసే అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు వ్యవస్థగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత్‌లో యుపిఐ అత్యంత ప్రాధాన్య చెల్లింపు వ్యవస్థగా మారిందని, త్వరలో నగదు లావాదేవీలను అధిగమిస్తుందని ఆయన అన్నారు. భారతదేశం, సింగపూర్ మధ్య సరిహద్దు చెల్లింపు కనెక్టివిటీ మంగళవారం ప్రారంభమైంది. దీనిలో భారతదేశానికి చెందిన యుపిఐ సింగపూర్‌కు చెందిన పేనౌతో లింక్ చేశారు. భారతదేశంలో నగదు వినియోగదారుల కంటే యుపిఐ వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రధాని మోడీ, సింగపూర్ పిఎం లీ సీన్ లూంగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రెండు దేశాల చెల్లింపుల కనెక్టివిటీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, 2022 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 74 బిలియన్ల లావాదేవీల ద్వారా మొత్తం రూ.126 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. భారతదేశంలో యుపిఐ విజయాన్ని చూసి, ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఈ కొత్త సిస్టమ్‌లో చేరుతున్నాయని అన్నారు. యుపిఐ పేనౌ లింక్‌ను ప్రారంభించిన తర్వాత రెండు దేశాల మధ్య డబ్బు లావాదేవీ చాలా సులభం అవుతుంది. ప్రజలు భారతదేశంలో డబ్బును బదిలీ చేసినట్లే యుపిఐ ద్వారా సింగపూర్‌కు డబ్బును బదిలీ చేయగలుగుతారు. నేటి నుంచి సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయులు పే నౌ, యుపిఐ ద్వారా నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ కస్టమర్లు డబ్బు తీసుకోవడం, ఇవ్వడం రెండింటి సౌకర్యాన్ని పొందుతారు. అదే సమయంలో యాక్సిస్ బ్యాంక్, డిసిబి బ్యాంక్ కస్టమర్‌లు డబ్బును మాత్రమే ఆర్డర్ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News