Sunday, December 22, 2024

యూపీఐ లైట్ వాడుతున్నారా?

- Advertisement -
- Advertisement -

యూపీఐ యాప్ ద్వారా చిన్న లావాదేవీల నుంచి పెద్ద లావాదేవీల వరకు ఎంతో సులభంగా చేయవచ్చు. ఈ యూపీఐ కి సంబంధించిన ఫీచర్లు, అప్డేట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ పేమెంట్ ఆఫ్ ఇండియా(NPCI) ద్వారా విడుదల చేయబడుతుంది. చిన్నచిన్న చెల్లింపులను వేగవంతంగా చేయాలని సెప్టెంబర్ 2022లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ పేమెంట్ ఆఫ్ ఇండియా లైట్ పేమెంట్ యాప్ ని పరిచయం చేసింది. దీనిని యూపీఐ లైట్ అని కూడా పిలుస్తారు. చిన్న లావాదేవీలకు ఇది ఉత్తమమైనదని చెప్పవచ్చు. అయితే, దీని ద్వారా వినియోగదారులు పిన్ నమోదు చేయకుండా చెల్లింపులను సులభంగా చేయవచ్చు. ప్రతి చెల్లింపు కోసం వినియోగదారుడు పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదు.

ఈ నేపథ్యంలో యూపీఐ లైట్ ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయానికొస్తే..మొదటగా గూగుల్ ప్లే స్టోర్ లో యూపీఐ లైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చెల్లింపు చేసే సమయంలో యూపీఐ లైట్ పై క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా చెల్లింపు చేయవచ్చు.

ఈ క్రమంలోనే ఇప్పుడు మనం యూపీఐ లైట్ ప్రయోజనాలు, అప్రయోజనాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.

 

యూపీఐ లైట్ ప్రయోజనాలు:

1. యూపీఐ లైట్ ద్వారా చెల్లింపు కోసం PIN అవసరం లేదు.
2. దీని సహాయంతో మీరు రూ. 5000 వరకు రోజువారీ చెల్లింపులు చేయొచ్చు.
3. రియల్ టైమ్ ట్రాకింగ్ ఫీచర్ కారణంగా ప్రతి లావాదేవీ రికార్డ్ చేయబడుతుంది.
4. ఈ యాప్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ పేమెంట్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రింద పని చేస్తుంది.
5. ఒక్కో లావాదేవీకి పరిమితి రూ. 1000 వరకు ఉంటుంది.

యూపీఐ లైట్ అప్రయోజనాలు:

1. మీరు యూపీఐ లైట్ వాలెట్‌లో ఒకేసారి గరిష్టంగా రూ. 5000ని ఉంచుకోవచ్చు.
2. మీరు ఒకేసారి రూ. 1000 వరకు మాత్రమే లావాదేవీలు చేయవచ్చు.
3. యూపీఐ లైట్ ద్వారా చెల్లింపు చేయవచ్చు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News