Sunday, January 12, 2025

లైట్ వాలెట్‌పై లావాదేవీ పరిమితి పెంపు..

- Advertisement -
- Advertisement -

చిన్న చెల్లింపుల కోసం యూపీఐ లైట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వినియోగదారులు ఇంటర్నెట్ లేకుండానే దీని ద్వారా లావాదేవీలు చేయవచ్చు. ఆఫ్లైన్ చెల్లింపుల కింద ఫోన్ లో ఇంటర్నెట్, ఎలాంటి నెట్ వర్క్ లేకపోయినా చెల్లింపులు చేయవచ్చు. అంతేకాకుండా.. యూపీఐ వినియోగదారులు ఎలాంటి పిన్ ను నమోదు చేయకుండానే లావాదేవీలు చెల్లించవచ్చు.

ఈ క్రమంలోనే యుపిఐ గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచడానికి ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ఆమోదం తెలిపారు. వినియోగదారులకు ప్రతి లావాదేవీ పరిమితి రూ. 1000గా మారింది. ఇక వాలెట్ లావాదేవీ పరిమితి అయితే రూ.2000 నుంచి రూ.5000కి పెరిగింది. ఒక్కో చెల్లింపుల పరిమితి రూ.500 నుంచి రూ.1000కి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News