Thursday, January 23, 2025

యుపిఐ చెల్లింపుల పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

- Advertisement -
- Advertisement -

ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో లావాదేవీలకు వెసులుబాటు
ఆర్‌బిఐ నిర్ణయం
వరుసగా రెపో రేటు యథాతథం

ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. తాజాగా ఆర్‌బిఐ నిర్ణయంతో ఇప్పుడు ఈ సంస్థలు యుపిఐ సహాయంతో మరిన్ని చెల్లింపులు చేయవచ్చు. కొత్త పాలసీ ప్రకారం ఇప్పుడు ఒక్కో లావాదేవీకి రూ.లక్ష కాకుండా యుపిఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించవచ్చు. ఆర్‌బిఐ యుపిఐ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. హాస్పిటల్ బిల్లులు, పాఠశాల, -కాలేజీ ఫీజులు చెల్లించడంలో కలిగే అసౌకర్యం తగ్గుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News