Sunday, March 23, 2025

ఆ నెంబర్లకు యుపిఐ సేవలు బంద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇప్పుడు ఎక్కడ చూసినా.. యుపిఐ పేమెంట్లే కనిపిస్తున్నాయి. చిన్న నుంచి పెద్ద వరకూ ప్రతీ ఒక్కరు ఈ యుపిఐతో పేమెంట్లు చేయడానికి అలవాటు పడ్డారు. అయితే యుపిఐ యూజర్లకు త్వరలోనే షాక్ తగలనుంది. కొన్ని నెంబర్లకు యుపిఐ సేవలు నిలిపివేస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ) వెల్లడించింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి యాక్టివ్‌గా లేని, రీ అసైన్ చేసిన మొబైల్ నెంబర్లకు యుపిఐ సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మోసాలు, అనధికార లావాదేవీలను నిరోధించడానికి ఈ నెంబర్లను తొలగించాలని ఎన్‌పిసిఐ బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లను(పిఎన్‌పి) అదేశించింది. దీంతో మొబైల్ నెంబర్ మార్చినప్పటికీ.. బ్యాంకులో అప్‌డేట్ చేయని యూజర్లపై, చాలాకాలంగా కాల్స్, ఎస్ఎంఎస్, లేదా బ్యాంకింగ్ అలర్ట్స్ రాని ఇన్‌యాక్టివ్ నెంబర్లు యూజర్లపై, తమ బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేయకుండా.. నెంబర్‌ను సరెండర్ చేసిన యూజర్లపై, తమ పాత నెంబర్‌ను వేరొకరికి కేటాయించిన యూజర్లపై దీని ప్రభావం ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News