Monday, January 20, 2025

ఉప్పల్‌లో సెటిలర్స్‌పైనే ఆశలు!

- Advertisement -
- Advertisement -

ఉప్పల్‌లో మూడు ప్రధాన పార్టీల మధ్య టఫ్ పైట్

మనతెలంగాణ/ఉప్పల్ : గ్రేటర్ హైదరాబాద్‌లో ఉప్పల్ అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పుకే మొగ్గు చూపిస్తారు.. పారిశ్రామికవాడల్లో పనిచేసే కార్మికులు.. కార్మిక సంఘాల ప్రభావంతో ప్రశ్నించే స్వభావం ఉన్నవారే అధికం. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు స్థానిక ఓటర్లు కంటే సెటిలర్స్ ఓట్లే అభ్యర్థు లు గెలుపులో కీలకంగా మారనున్నాయి. గులాబీ పార్టీ సిట్టింగ్ అభ్యర్థిని మార్చి 2014 కాంగ్రెస్‌ను పోటీచేసిన బండారి లకా్ష్మరెడ్డికి టిక్కె ట్ ఇచ్చింది. అధికారపార్టీ అభివృద్ధి పథకాలతోపాటు బిఎల్‌ఆర్ ట్రస్టు చేసిన సేవలను నమ్ముకున్నారు. బిఆర్‌ఎస్ ప్రచారంలో అందరికంటే ముందే ఉన్నప్పటికీ సిట్టింగ్ అభ్యర్థిని మార్చడం, హస్తం నుంచి వచ్చి న నేతల ప్రచారం ఎటు దారి తీస్తుందనే ప్రచారం సైతం జరుగుతుం ది. బిఆర్‌ఎస్ మాత్రం లక్ష మెజార్టీతో గెలుస్తామనే ధీమాతో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు నేతలు టిక్కెట్ ఆశించి భంగపడి అధికార పార్టీలో చేరి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే లక్షంగా పనిచేస్తున్నారు.

భారతీయ జనతాపార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ బరిలో ఉన్నారు. గతంలో ఇదే అసెంబ్లీ గెలవడంతో తాను చేసిన అభివృద్ధి పథకాలే మరోసారి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాడి టిక్కెట్ సాధించిన మందముల పరమేశ్వరరెడ్డి ప్రచారంలో వినూత్నంగా ముందుకెళ్తున్నారు. గతంలో కార్పొరేటర్‌గా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలోనే ఉప్పల్‌కి మెట్రో వచ్చిందనే ప్రచారంతో జనం ‘హస్తం’ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. వీటికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ జనంలోకి తీసుకెళ్లడంతో విజయం సాధించారు. ప్రధానంగా ఉప్పల్, రామంతాపూర్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, కుషాయిగూడ పారిశ్రామికవాడల్లో పనిచేసే కార్మికుల ఓట్లే అధికం. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ స్థిరపడ్డారు. వీరి ఓట్లు కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తుందని అభ్యర్థి ధైర్యంగా ఉన్నారు. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు కమలం వైపు ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. గత అభివృద్ధితో పాటు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్లలో కార్పొరేటర్లును గెలిపించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News