2022నాటికి పూర్తి చేయడం లక్షంగా పనులు
నగరంలో రెండవ అతిపెద్ద ఎలివెటేడ్ కారిడార్
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఉప్పల్ ప్లైఓవర్ ఎ లివేటెడ్ కారిడార్‌ని ర్మాణం పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు 6కిలో మీటర్ల మేర నగర విస్తరణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయింది. దీంతో సమస్యను పరిష్కరించేందుకు ఉప్పల్ నుంచి నారపల్లి (భాగ్యనగర్ కాలనీ) వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 6.2 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్లైఓవర్ పి.వి ఎక్స్‌ప్రెస్ వే తర్వాత హైదరాబాద్ నగరంలో రెండవ అతి పెద్ద ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇదే. మొత్తం రూ. 960 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్లై ఓవర్ నిర్మాణ ఖర్చులను రోడ్ల భవనాల శాఖ (రూ. 675 కోట్లు) భరిస్తుండగా భూసేకరణకకు రాష్ట్ర ప్రభుత్వం (రూ.360కోట్లను) ఇతర మౌలిక సదుపాయాలకు జిహెచ్‌ఎంసి వ్యయాన్ని భరిస్తోంది. మొత్తం 6.2 కిలో మీటర్ల పొడవునా 148 పిల్లర్లతో 6 లైన్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను 2022 చివరినాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్షంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ప నుల్లో భాగంగా 4.5 కిలో మీటర్ల మేర 120 ఫిల్లర నిర్మాణం పూర్తిగా కా గా మరో 1.5 కిలో మీటర్ల 28 ఫిల్లర నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఉప్పల్ నల్ల చెరువు నుంచి నారపల్లి (భాగ్యనగర్ కాలనీ) వరకు పిల్లర్ల నిర్మాణం పూర్తి కావడమే కాకుండా చాల మేరకు పైనా స్లాబ్‌కు సంబంధించి (ఫ్రీకాస్ట్ )పనులు సైతం చాల మేరకు పూర్తి అయ్యాయి. నల్ల చెరువు నుంచి ఉప్పల్ ఎక్స్‌రోడ్ భూ సేకరణ పనులను ప్రభుత్వం ఇటీవలే పూర్తి చేయడంతో కిలో మీటరు మేర నిలిచినపోయిన ఫిల్లర్ల నిర్మాణానికి పనులను సిద్ధం చేస్తున్నారు.
ఎలివెటేడ్ తో పాటు సర్వీస్ రోడ్డు నిర్మాణం
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఎలివెటేడ్ కారిడార్ నిర్మాణ పనులతో పాటు 4 లైన్ల సర్వీస్ రోడ్‌ను సైతం సమాంతరంగా నిర్మించనున్నారు. ఇరు వైపులా రెండు లైన్ల చొప్పున మొత్తం 150 ఫీట్ల మేర నిర్మించనున్న రోడు స్థానికుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే విధంగా తీర్దిదిద్దనున్నారు. దీంతో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నేరుగా వెళ్లాలనుకునే వారు ఎలివెటేడ్ కారిడార్‌ను ఉపయోగించుకోనుండగా ఉప్పల్ , బోడుప్పల్ మేడిపల్లి వరకు ఉన్న కాలనీల వాసులు సర్వీస్ రోడ్ ఉపయోగపడనుంది. అంతే కాకుండా హెచ్‌ఎండిఎ సైతం రూ.25 కోట్ల వ్యయంతో ఉప్పల్ రింగ్ రోడ్‌లో స్ర్కైవే నిర్మిస్తోంది. 660 మీటర్ల పొడవులో 6.15 మీటర్ల ఎత్తులో 36 పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ స్కైవే ఈ ప్రాంతానికి కొత్తం అందాలను సంతరించుకోవడమే కాకుండా పాదచారుల కష్టాలు పూర్తిగా తీరనున్నాయి.