ఉప్పల్‌లో.. ఎన్నాళ్లీ ట్రాఫిక్ తిప్పల్
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం ఎప్పుడో?
పట్టించుకోని ప్రజాప్రతినిధులపై ప్రజలు ఫైర్
మన తెలంగాణ/ఉప్పల్: ఉప్పల్ పట్టణంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవ ర్ బ్రిడ్జి) నిర్మాణ పనులను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారోనని ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నా రు. కారిడార్ నిర్మాణ పనులపై నిర్లక్ష్యం ఎవరిదో ఏ మో కానీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తు న్న ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు ప్రధాన రహదారి విస్తరణతో పాటు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక నిధులు కేటాయించింది. ఇట్టి ని ర్మాణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గట్కరి రాష్ట్ర మంత్రులతో కలిసి భూమి పూజ చేసిన విషయం తె లిసిందే.
ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లిలోని సి పిఆర్‌ఐ వరకు 6.5 కిలోమీటర్ల వరకు చేపట్టాల్సిన కారిడార్ నిర్మాణ పనుల ప్రారంభించారు. కొంతకా లం చకచకా పనులు ముందుకు సాగాయి. పిల్లర్స్ పూర్తి చేసి కొంత భాగం కొద్ది దూరం వరకు మా త్రమే స్లాబుల్ కూడా వేశారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ మధ్యలోనే అర్ధాంతరంగా ఇట్టి పనులు నిలిచిపోయాయి. నిర్ణీత గడువులో పూర్తి కావలసిన కారిడార్ నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్నా ముం దుకు సాగడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య మరిం త తీవ్రమైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్లచెరువు వరకు మ ధ్యలో తరచూ వాటర్ లేక డ్రైనేజీ పైప్లైన్ పనులు జ రుగుతుండడం, పగులుతుండడం వల్ల ట్రాఫిక్ సుడిగుండములో వాహనాదారులు ఇరుక్కొని తీవ్ర ఇ బ్బందులకు గురవుతున్నారు.
జాతీయ రహదారు లు, జిహెచ్‌ఎంసి అధికారులు మౌనంగా ఉండడం తో ట్రాఫిక్ పోలీసులు ముందుగా స్పందిస్తున్నారు. విధుల్లో భాగంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఈ స మస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో, ఆదివారం సెలవు దినం రోజు న ట్రాఫిక్ సమస్యతో వాహనాదారులు పడుతున్న క ష్టాలు వర్ణనాతీతం. ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు అర్ధాంతరంగా నిలిచిపోయిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను నెల రోజుల్లోగా తి రిగి ప్రారంభించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమములో సమస్యను స్వయంగా తెలుసుకోవడానికి ఉ ప్పల్‌లో పర్యటించారు. ఈ విషయంలో అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అయినా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పనుల విషయములో జాప్యం జరుగుతోంది.
చర్లపల్లిలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. డిసెంబర్ 28వ తేదీన ప్రారంభించాల్సి ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం పట్ల రైల్వే జంక్షన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. త్వరలో ప్రారంభోత్సవం కాను న్న నేపథ్యంలో అప్రోచ్ రోడ్లు ఎంతో అవసరం. ఉ ప్పల్ ప్రధాన రహదారితో పాటు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వరంగల్ జాతీయ రహదారిలోని చెంగిచర్ల చౌరస్తా నుంచి ఇండియన్ గ్యాస్ చౌరస్తా మీదుగా మల్లాపూ ర్ ఎలిఫెంట్ బ్రిడ్జి వరకు రహదారి విస్తరణతో పాటు మరమ్మత్తులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప లువురు అభిప్రాయపడుతున్నారు. రైల్వే జంక్షన్ ప్రారంభమైతే మరింత రద్దీ పెరిగే అవకాశం ఉం దని, ప్రజా ప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా కృషి చేయాలని ప్రజ లు కోరుతున్నారు. రహదారి విస్తరణ పనులతో పా టు మరమ్మత్తులను సైతం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.