Monday, December 23, 2024

ఉప్పల్ రింగ్ రోడ్డులో స్కైవాక్ పిల్లర్ ను ఢీకొట్టిన లారీ

- Advertisement -
- Advertisement -

ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుకలోడుతో హైదరాబాద్ కు వస్తున్న లారీ అదుపుతప్పి స్కైవాక్ ఫిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: రాబందుల చేతుల్లో పెట్టొద్దు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News