హెచ్‌సిఎ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
మన తెలంగాణ/ హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు తెలిపారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలోని గణపతి ఆలయం, ప్రధాన పిచ్ వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లండ్‌భారత్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌కు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించి 20 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడు పోయాయన్నారు. మరోవైపు మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దామని జగన్‌మోహన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సిఎ ప్రధాన కార్యదర్శి దేవ్‌రాజ్, ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, కోశాధికారి సిజె శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బసవరాజు, స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు.
ఉప్పల్ మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -