Monday, December 23, 2024

ఉప్పల్ మ్యాచ్ ఏర్పాట్ల పర్యవేక్షణ

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టి20 మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లను సుప్రీం కోర్టు నియమించిన కమిటీ బుధవారం సమీక్షించింది. ఐపిఎస్ అధికారి అంజినీ కుమార్, భారత మాజీ క్రికెటర్ వెంకటపతి రాజుల నేతృత్వంలోని బృందం ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా వారు ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మ్యాచ్ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వారు హెచ్‌సిఎ అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News