Monday, December 23, 2024

నేను చేసిన తప్పేంటి?… నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు: బేతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను చేసిన తప్పేంటి అని, ప్రజల్లోనే ఉంటానని తనకు ఎందుకు బిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వలేదని ఉప్పల్ ఎంఎల్ఎ బేతి సుభాష్ రెడ్డి ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి మాట్లాడారు. ఇప్పటి వరకు అక్రమాలు చేయలేదని, ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు అమ్ముకున్నానని వివరించారు. ఉద్యమకారుడిగా తాను చేసిన అన్యాయం ఎంటి? అని అడిగారు. బిఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం నుంచి తనకు పిలుపు వస్తుందని ఆశిస్తున్నానని, పది రోజుల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని బేతి హెచ్చరించారు. అక్రమాలు చేసిన వారికి టిక్కెట్లు ఇచ్చారని, అర్హత లేని అభ్యర్థికి ఉప్పల్ టిక్కెట్ ఎలా ప్రకటిస్తారని బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ ను బేతి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News