Wednesday, January 22, 2025

కెసిఆర్‌ను తిట్టి పైశాచికానందం పొందుతున్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ రింగ్‌రోడ్డులో పాదచారుల కోసం 25 కోట్ల రూపాయలతో స్కైవాక్ ఏర్పాటు చేసుకున్నామని మంత్రి కెటిఆర్ వివరించారు. ఉప్పల్ నియోజకవర్గానికి రూ.451 కోట్ల వ్యయంతో మంచినీళ్లందించామని చెప్పారు. హైదరాబాద్‌లో 70 కిలో మీటర్లు మెట్రో పూర్తి చేశామన్నారు. ఉప్పల్‌లో స్కైవాక్ టవర్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్ వరకు 31 కిలో మీటర్ల మెట్రోను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉప్పల్ నియోజకవర్గానికి మరో ఐదు వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో తొమ్మిదేళ్ల క్రితం కరెంట్ కష్టాలు ఉండేవని, ఇన్వర్టర్లు, జనరేటర్లు లేకుంటే ఎన్ని కష్టాలు పడ్డామో ఉప్పల్ వాసులకు తెలుసునన్నారు.

Also Read: అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్: కెటిఆర్

గతంలో కరెంట్ ఉంటే వార్తలాగా ఉండేదని, ఇప్పుడు కరెంట్ పోతే వార్త లాగా ఉందన్నారు. విపక్షాలు అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నాయని, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడి వెళ్లారని, సిఎం కెసిఆర్‌ను తిట్టి పైశాచికానందం పొందుతున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు కట్టలేదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. అవినీతి గురించి టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడితే చంపి సంతాపం తెలిపినట్లుగా ఉందని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రగతి రథచక్రాలు ఆగొద్దంటే మళ్లీ బిఆర్‌ఎస్ రావాలని పిలుపునిచ్చారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పారు.

Uppal skywalk

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News