Saturday, November 23, 2024

ఉప్పల్ స్కైవాక్ ప్రారంభానికీ సిద్దం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  అత్యంత రద్దీ చౌరస్తాలో ఒక్కటైన ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద ఎటు వైపు రోడ్డు దాటలన్నా తమ పాదచారులు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుకోవాల్సిన ప్రసుత్త పరిస్థితి. అయితే ఇంకా మీద ఉప్పల్ చౌరస్తాలో వద్ద రోడ్డు దాటే పాదచారుల కష్టాలు పూర్తిగా తీరనున్నాయి. జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను త్వరలోనే అందుబాటులోకి రానుంది. పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు ఆలోచనలో నుంచి పురుడు పోసుకున్న ఈ స్కైవే బ్రిడ్జిను సుమారు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.

రాబోయే 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా ధృడమైన ఉక్కుతో ఈ వంతెన(ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు) రూపకల్పన చేశారు.ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించారు. హైదరాబాద్ తుర్పు వైపు నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్న మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు ఆర్కిటెక్చర్లు, డిజైనర్లు, సీనియర్ ఇంజనీర్ల బృందానికి స్కైవే ప్రాజెక్టు బాధ్యతలను మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ అప్పగించారు. దీంతో సరికొత్త నమూనాతో ప్రస్తుత పాదచారుల వంతెన రుపుదిద్దుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News