Sunday, January 19, 2025

రంజీ ఫైనల్‌కు ఉప్పల్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి హైదరాబాద్‌ – మేఘాలయ తుది పోరు

మన తెలంగాణ/హైదరాబాద్ : రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్ సమరానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా హైదరాబాద్‌, మేఘాలయ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. ప్లేట్ డివిజన్‌లో హైదరాబాద్ ఆడిన ఆరు మ్యాచుల్లో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మేఘాలయ నాలుగు విజయాలతో రెండో స్థానంలో నిలిచి తుది పోరు కు అర్హత సాధించింది. మేఘాలయతో పోల్చితే హైదరాబాద్ చాలా బలంగా ఉంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్ విజయాన్ని అందుకుంది. లీగ్ దశలో మేఘాలయను కూడా చిత్తుగా ఓడించింది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హైదరాబాద్ పటిష్టంగా ఉంది. తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, రోహిత్ రాయుడు, కెప్టెన్ తిలక్‌వర్మ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News