Sunday, December 22, 2024

ఉప్పల్ స్టేడియానికి అత్యుత్తమ పిచ్, గ్రౌండ్ అవార్డు.. రూ.50 లక్షల నగదు బహుమతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్-17వ సీజన్ అత్యుత్తమ పిచ్, గ్రౌండ్ అవార్డు ఉప్పల్ స్టేడియాన్ని వరించింది. ఆదివారం చెన్నైలో జరిగిన ఐపిఎల్ ముగింపు వేడుకల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఈ పురస్కరాన్ని అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు హెచ్‌సిఎకు రూ.50 లక్షల నగదు బహుమతిని కూడా ఐపిఎల్ నిర్వాహకులు అందజేశారు.

ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఐపిఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు కార్యదర్శి దేవ్‌రాజ్‌తో పాటు ఇతర అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, హెచ్‌సిఎ సిబ్బంది అహర్నిశలు శ్రమించారని, ముఖ్యంగా చీఫ్ క్యురేటర్ చంద్రశేఖర్, ఇతర గ్రౌండ్‌మన్ సిబ్బంది అద్భుతంగా పనిచేశారు’ అని కితాబు ఇచ్చారు. ఈ అవార్డు హెచ్‌సిఎ కుటుంబ సభ్యులందరీ కష్టానికి ప్రతిఫలమని జగన్మోహన్ రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News