Monday, December 23, 2024

అమెరికాలో ఉప్పల్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని జార్జియాలో గన్ పేలి హైదరాబాద్ కు చెందిన యువకుడు మృతి చెందాడు. అట్లాంటాలోని గన్ మిస్ ఫైర్ కావడంతో పాల్వాయి అర్యన్ రెడ్డి (23) ఈ నెల 13న దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని ఉప్పల్ కు చెందిన ఆర్యన్ రెడ్డి గత సంవత్సరం ఎంఎస్ చేయగానికి అమెరికాకు వెళ్లారు. కెన్నెసా యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 17 న స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకుంటుండగా ఆర్యన్ గది నుంచి తుపాకీ శబ్ధం వచ్చింది. స్నేహితులు వెళ్లి చూసేసరికి అతడు రక్తపు మడుగులో కనిపించాడు. బుల్లెట్ ఛాతీలోకి వెళ్లినట్టుగా గుర్తించారు. తుపాకీ శుభ్రం చేసే సమయంలో మిస్ ఫైర్ అయి ఉంటుందని తండ్రి సుదర్శన్ రెడ్డి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News