- Advertisement -
హైదరాబాద్: హబ్సిగూడ సిగ్నల్ దగ్గర శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు కిందకు ఆటో దూసుకెళ్లింది. ఆటోలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ఉన్న విద్యార్థిని సాత్విక చికిత్స పొందుతూ మృతి చెందగా ఆటో డ్రైవర్ ఎల్లయ్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సాత్విక హబ్సిగూడలోని గౌతమ్ స్కూళ్లో పదో తరగతి చదువుతోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను క్రేన్ సహాయంతో బస్సు కింద నుంచి తొలగించారు. టిప్పర్ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -