Thursday, January 23, 2025

వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌కు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా ఆయన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ హైదరబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు నియామక పత్రం అందజేశారు.

ఇంకా ఇదే కార్యక్రమంలో గంజి రాజమౌళి గుప్తాకు అడ్వైజర్ కమిటీ చైర్మన్‌గాను నియామక పత్రం అందజేశారు. కాగా ఈ పదవి 2023 నుండి 2026 వరకు వర్తించనుంది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా , గంజి రాజమౌళి గుప్తా లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు అందర్నీ ఏకం చేయాలని వాణిజ్యపరంగా ఉద్యోగ పరంగా రాజకీయపరంగా అందరి పేద వైశ్యులని ఆదుకోవడానికి తమవంతు కృషి చేస్తామని చెప్పరు . ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ ,ఐవిఎఫ్ రాష్ట్ర అడ్వైజర్ ముత్యాల సత్తయ్య , ఉడుత పురుషోత్తం , రొంపల్లి సంతోష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News