Saturday, December 21, 2024

మొక్కలు నాటే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది

- Advertisement -
- Advertisement -

Uppala srinivas gupta planted trees in Hyderabad

హైదరాబాద్: తన 50వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పాల్గొని మొక్కలు నాటారు. గురువారం ఉదయం హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూప కర్త ఎంపీ రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వారి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఆ తర్వాత ఉప్పల శ్రీనివాస్ గుప్త ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో బాగంగా మొక్కలు నాటడం, ఆనందంగా ఉందని చెప్పారు. తెలంగాణ కు హరితహారం కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటుతూ.. తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మారుస్తూ.. కలియుగ అశోక చక్రవర్తిలాగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు. సీఎం మానస పుత్రికైన తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో చేపట్టిన కార్యక్రమాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనటం గొప్పవరంలా భావిస్తున్నామని తెలిపారు. రాబోయే తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తుచేశారు. వృక్షో రక్షతి: రక్షితః ఒకప్పుడు అశోకుడు దారికి ఇరువైపులా మొక్కలు నాటి ప్రపంచమంతా తెలియజేశారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమం ద్వారా, వందల కోట్ల మొక్కలు నాటించారు. అదే స్పూర్తితో రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మొత్తం మీద కొన్ని కోట్ల మొక్కలు నాటేలా చేస్తున్నారు కాబట్టి ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే “తెలంగాణకు హరిత హరం” కార్యక్రమంతో కూడా సీఎం ఒక పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని కొన్ని కోట్ల మొక్కలు నాటించి, ప్రతి సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమం తుచతప్పకుండా అమలు పరుస్తున్నారని అన్నారు.

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి, గ్రీనరిలో భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని, చెట్లు ఎక్కడైతే ఎక్కువ వుంటాయో అక్కడ వానలు బాగా కురుస్తాయి. పాడి పంటలు చాలా బాగుంటాయి అలాగే వాతావరణం కూడా బాగుంటుంది అని తెలిపారు. దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత 24% ఉన్న గ్రీనరిని 32% పర్సెంట్ కు పెంచడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అని, ఇంత మంచి కార్యక్రమంలో ఇలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడం పట్ల ఎంపీ కృషిని అభినందిస్తూ.. అందుకు స్ఫూర్తినిచ్చిన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, జిల్లా స్థాయి అన్ని విభాగాల సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News