Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రిని కలిసిన ఉప్పల శ్రీనివాస్‌గుప్త

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపిని ఓడించి, ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆదరణ తగ్గలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి నిరూపించారని రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన టిఆర్‌ఎస్ పార్టీ ముఖ్యుల సమావేశం, రాష్ట్రంలోని పలు మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఉప్పల శ్రీనివాస్‌గుప్త మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ తెలుసుకోవడంతో పాటు, మరింత కృషి చేయాలని ఆయనకు సూచించారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, ఆర్యవైశ్యులందరూ టిఆర్‌ఎస్ పక్షాన నిలిచి మునుగోడులో గెలిపించారని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా శ్రీనివాస్‌గుప్త వివరించారు. జాతీయ స్థాయిలో బిఆర్‌ఎస్ కార్యకలాపాలకు ఆర్యవైశ్యులు అండగా నిలవాలని ఈ సందర్భంగా కెసిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News