Friday, November 22, 2024

శిల్పా చౌదరికి షాక్

- Advertisement -
- Advertisement -
Upparpally court denies to shilpa chaudhary bail
బెయిల్ తిరస్కరించిన కోర్టు

హైదరాబాద్: కిట్టీ పార్టీల పేరుతో పలువురు విఐపిలు, పోలీసు అధికారులు, సినీ ప్రముఖులను మోసం చేసిన కేసులో అరెస్టైన శిల్పా చౌదరికి ఉప్పరపల్లి కోర్టు సోమవారం బెయిల్ నిరాకరించింది. దీంతో ఆమెను నార్సింగి పోలీసులు చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. మరోవైపు శిల్పా చౌదరిని మరోసారి కస్టడిఈకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత వారంలో నార్సింగి పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పాటు శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు విచారిం చారు. అయితే మూడు రోజుల్లో శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు రావడంతో బ్యాంకు లావాదేవీల వివరాలు తీసుకునేందుకు పోలీసులకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో మరోసారి పోలీసులు కోర్టులో రెండు రోజుల పాటు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఒక్క రోజు మాత్రమే శిల్పా చౌదరిని కస్టడీకి ఇస్తూ అనుమతిని ఇచ్చింది.

ఈ నెల 2వ తేదీన కూడా ఉప్పరపల్లి కోర్టులో శిల్పా చౌదరి, ఆమె భర్త బెయిల్ పిటిఫన్లు దాఖలు చేశారు. అయితే శిల్పాచౌదరి భర్తకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే శిల్పా చౌదరికి మాత్రం కోర్టు బెయిల్ లభించ లేదు. ప్రముఖులను లక్షంగా చేసుకుని వారి నుండి డబ్బులు వసూలు చేసేందుకు కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసేదని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను వసూలు చేసిందని ఆమెపై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మూడ్రోజుల పాటు పోలీసుల కస్టడీలో శిల్పా చౌదరి పోలీసులకు చుక్కలు చూపించింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. మరోవైపు ఎన్నారై ప్రతాప్‌రెడ్డి, మల్లారెడ్డి, రాధికారెడ్డిల నుండి తనకు డబ్బులు రావాల్సి ఉందని శిల్పా చౌదరి పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

శిల్పా చౌదరి సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదే క్రమంలో ఎన్నారై ప్రతాప్‌రెడ్డికి పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఎన్నారై ప్రతాప్‌రెడ్డి మాత్రం పోలీసులకు విభిన్న రీతిలో సమాధానం చెప్పినట్లు.., తనకే శిల్పా చౌదరి డబ్బులు ఇవ్వాలని చెప్పారని సమాచారం. పుప్పాల గూడకు చెందిన దివ్యారెడ్డి తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పలువురు శిల్పాచౌదరి ద్వారా తాము మోసపోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు సినీ హీరోల కుటుంబాలను కూడా శిల్పాచౌదరి మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ మేరకు సినీ ప్రముఖులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News