బెంగళూరు: అగ్రవర్ణాలకు చెందిన యువకులు ద్విచక్ర వాహనాలపై వెళ్తుండగా వారిని దళితుడు ఓవర్ టేక్ చేశాడని అతడిని చెట్టుకు కట్టేసి కొట్టడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉదయ్ కిరణ్ అనే దళిత యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అగ్రవర్ణాలకు చెందిన రాజు, శివరాజు, గోపాల్ క్రిష్ణప్ప, మునివెంకటప్ప అనే యువకులు బైక్‌లపై వెళ్తుండగా వారిని ఉదయ్ ఓవర్ టేక్ చేశాడు. దీంతో అతడిని కులం పేరుతో దూషించారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో మనస్థాపం చెందిన ఉదయ్ ఇంటికెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. అక్కడ నుంచి గ్రామ శివారులోకి వెళ్లి ఉదయ్ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో రాజస్థాన్ రాష్ట్రంలో భరత్ కుమార్ అనే దళితుడు కూలీ డబ్బులు ఇవ్వమని అగ్రకులానికి చెందిన వ్యక్తులను అడిగినందుకు అతడి మెడలో చెప్పుల దండం వేసి అవమానపరిచారు.
బిజెపిలో పాలనలో దళితులకు బైక్ నడిపి హక్కులేదా? అని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. బిజెపి పాలనలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని తన ట్విట్టర్‌లో కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దళితలుకు వ్యతిరేకంగా బిజెపి పాలన కొనసాగిస్తుందని ధ్వజమెత్తింది. ఉదయ్ కుమార్ ఆత్మహత్యపై ఇప్పటివరకు బిజెపి నేతలలో ఒక్కరు కూడా ప్రశ్నించలేదని మండిపడింది.