Monday, December 23, 2024

ఉప్పు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం ఎప్పుడు..?

- Advertisement -
- Advertisement -

వేంసూరు : మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో తుంగ వారి కాలనీ వద్ద ఉప్పు వాగుపై బ్రిడ్జి నిర్మాణం కు మోక్షం ఎప్పుడు అని గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉప్పు వాగు పొంగినప్పుడల్లా వరదల ఉధృతికి వరద నీరు బ్రిడ్జి పై నుండి వెళ్తుండటంతో, ప్రతి ఏడాది కూడా, రెవిన్యూ శాఖ, పోలీస్ శాఖ, వెంటనే అప్రమత్తమై రహదారిపై ట్రాక్టర్లను అడ్డుపెట్టి వాహనదారులను ప్రజలను ప్రయాణికులను అటువైపు పోనికుండా జాగ్రత్త పడుతుంటారు. దారి మల్లింపచేస్తుంటారు. ఉప్పు ఆగిపోయినప్పుడల్లా ప్రతి ఏడాది వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఖమ్మం జిల్లాల ప్రాంతాలకు పెద్ద వాహనాలు చిన్న వాహనదారులు ఈ బ్రిడ్జి, పై నుండి రహదారి గుండా కందుకూరుమీదుగా,

అటు దుద్దే పూడి మీదుగ ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఏలూరు జిల్లా ఎండపల్లి, రాఘవపురం మీదుగా చింతలపూడి, ఏలూరు, రాత్రి పగలు, బస్సులు వెళుతుంటాయి. ప్రయాణికులతో ఈ రహదారి రద్దీగా ఉంటుంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఈ ఉప్పు వాగుపై బ్రిడ్జి నిర్మాణం జరిగింది. కాలక్రమేనా ఈ బ్రిడ్జి శిథిలమైపోవడంతో బ్రిడ్జి కు ఇరువైపులా సపోర్టు స్తంభాలు వాగు పొంగినప్పుడల్లా వరద ఉధృతికి పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఎన్నో ఏళ్ల నుండి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో గ్రామాల ప్రజలు వర్షాకాలంలో ఉప్పు వాగు పొంగినప్పుడల్లా తాము అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మన తెలంగాణ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News