Monday, January 20, 2025

భూమి ఇవ్వలేదని మామను చంపిన అల్లుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్లుడికి ఇస్తానన్న భూమి ఇవ్వకపోవడంతో మామను రాయితో కొట్టి చంపిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉప్పునుంతలకు చెందిన గడ్డం సాయిబాబా, మర్రిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య(55) కూతురిని పెళ్లి చేసుకున్నాడు. కట్నం కింద ఎకరం భూమి ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో పలుమార్లు అల్లుడు భూమి ఇవ్వాలని అడిగాడు. శుక్రవారం అత్తింటికి వచ్చిన అల్లుడు భూమి ఇవ్వాలని అత్తతో గొడవకు దిగాడు.

ఇద్దరు మధ్య వాగ్వాదం పెరగడంతో ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆమె అక్కడి నుంచి తప్పించుకొని ఒక రూమ్‌లోకి వెళ్లి గడియపెట్టుకుంది. అప్పుడు వెంకటయ్య అక్కడికి రావడంతో మామతో అల్లుడు గొడవకు దిగాడు. రాయి తీసుకొని అతడి తలపై బాదడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికి వెంకటయ్య చనిపోయాడని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సాయిబాబాను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News