Sunday, January 5, 2025

పదేళ్ల బాలిక, మేకపై అఘాయిత్యం చేసిన వ్యవసాయ అధికారి

- Advertisement -
- Advertisement -

లక్నో: వ్యవసాయ శాఖ ఎడిఒ అధికారి పదేళ్ల బాలిక అత్యాచారం చేయడంతో పాటు తన ఇంట్లో ఉన్న మేకపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులందేశ్వర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వ్యవసాయ శాఖ అధికారి గజేంద్ర సింగ్ పక్కింట్లో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు బాలిక చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ఎడిఒ అధికారి గజేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గజేంద్ర సింగ్ మేకతో అసహజ శృంగారం చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యవసాయ అధికారిపై బిఎన్ ఎస్ సెక్షన్ 65(2), పోస్కో యాక్ట్ కింద నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడికి కోర్టు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని బులందేశ్వర్ ఎస్ఎస్పీ శ్లోక కుమార్ తెలిపాడు. అతడిని విధులు నుంచి సస్పెండ్ చేశామని వ్యవసాయ ఉన్నతాధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News