Sunday, January 5, 2025

బులంద్‌షహర్ జైలుకు ఫైవ్‌స్టార్ రేటింగ్!

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ కారాగారానికి ఫైవ్‌స్టార్ రేటింగ్, ‘ఈట్ రైట్ క్యాంపస్’ అనే ట్యాగ్‌ను భారత ఆహార భద్రత, నాణ్యత ప్రాధికార సంస్థ(FSSAI) ఇచ్చింది. అధికారిక ప్రకటన ప్రకారం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ బృందం ఆహార నాణ్యత, నిల్వ, ఆరోగ్య తదితర కఠిన చర్యలు పరిశీలించడానికి అక్కడి వంటగదిని సందర్శించింది. అక్కడి బులంద్‌షహర్ జైలు వాతావరణం చూశాక దానికి ‘ఫైవ్‌స్టార్’ రేటింగ్‌ను, అలాగే ‘ఈట్ రైట్ క్యాంపస్’ ట్యాగ్‌ను అదనంగా ఇచ్చింది. అంతేకాక ‘ఎక్సలెంట్’ అన్న రిమార్క్‌ను కూడి FSSAI ఇచ్చింది.

జైలు అధికారులు, ఖైదీలు సుందరీకరణ, శుభ్రత, ఆహార భద్రత విషయంలో విశేషంగా పనిచేశారని అధికారిక ప్రకటన పేర్కొంది. ఆహారం తయారుచేసేప్పుడు సిబ్బంది శుభ్రమై అప్రాన్స్, ఫుల్‌స్లీవ్ గ్లోవ్స్, టోపీలు ధరించారని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫర్రుఖాబాద్ జైలు తర్వాత, ఈ ట్యాగ్‌ను పొందిన రెండో కారాగారం బులంద్‌షహర్ జైలు.

FFSAI rating

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News