Sunday, January 19, 2025

‘కన్వర్ యాత్ర’ పై యూపీ, ఉత్తరాఖండ్, ఎంపీ లకు సుప్రీంకోర్టు నోటీసులు! ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  కన్వర్ యాత్ర(కావడి యాత్ర) అనేది శివ భక్తులు ఏడాదికోసారి చేసే యాత్ర. ఈ యాత్రలో ‘కన్వరియాస్’(కావడులు) లేక ‘భోలే’ లను భుజాలపై పవిత్ర యాత్రికులు మోసుకెళుతుంటారు. హిందూ భక్తులు ఈ యాత్రను చేస్తుంటారు.  దీనిని హిందీ వాళ్లు ‘సావన్’ (తెలుగులో అయితే ‘శ్రావణ’) మాసంలో చేస్తారు. ఈ ఏడాది ‘సావన్’ మాసం 2024  జులై 22న ప్రారంభమై ఆగస్టు 19 న ముగుస్తుంది.

ఈ సావన్ యాత్రలో భక్తులు గంగ నది నీళ్లను కుండలలో నింపుకుని తమ భుజాలపై ఎత్తుకుని వందలాది మైళ్లు నడిచి స్థానిక శివుని గుడి లేక నిర్దిష్ట శివుని గుడిలో గంగా జలం అర్పిస్తారు.  అంటే బాఘ్ పట్ జిల్లాలోని పురా మహదేవ్, మీరట్ లోని ఔఘర్నాథ్ , వారణాసిలోని కాశీ విశ్వనాథ్, బైద్యనాథ్ గుడులలో వాటిని అర్పిస్తారు.  త్రేతా యుగంలో రావణుడి అనుచరులైన శివ భక్తులు ఇలా గంగ నది నీళ్లను కావడులలో తెచ్చి పురామహాదేవ్ ఆలయంలో అర్పించారని, తద్వారా శివుడిలోని గరళాన్ని (నెగటివ్ ఎనర్జీని) తొలగించే ప్రయత్నం చేశారని కథనం.

గత వారం  కన్వర్ యాత్ర వెళ్లే మార్గంలో తమ దుకాణాలకు యజమాని పేర్లు, తిను భండారాల పేర్లు ఉన్న బోర్డులు పెట్టాలని ముజఫర్ నగర్ పోలీసులు ఆదేశించారు. కాగా ఉత్తర్ ప్రదేశ్ అంతటా ఈ విధానం పాటించాలని ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇది మత విచ్ఛినానికి దారి తీస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పైగా ముస్లింలను, ఎస్సీలను వారి గుర్తింపును వెల్లడించేలా బలవంత పెడుతుందని వాదించింది. కాగా దీనిపై సుప్రీం కోర్టు సోమవారం తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసింది. కన్వర్ యాత్ర వెళ్లే దారి పొడవున దుకాణదారులు తమ పేర్లను ప్రదర్శించే బోర్డును పెట్టాలన్న ఉత్తర్ ప్రదేశ్ ఉత్తర్వును లేక మార్గదర్శకాలను నిలిపివేసింది. కాకపోతే దుకాణదారులు తమ దుఖాణంలో ఏ తిండి పదార్థాలు పెడుతున్నారో బ్యానర్లలో పెట్టమంది.  పైగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు న్యాయమూర్తులు హృషికేశ్ రాయ్, ఎస్విఎన్ భట్టి తో కూడిన ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ముఖ్యంగా ‘నేమ్ ప్లేట్  ఉత్తర్వు’ విషయంలో.   అసోసియేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే ఎన్జీవో దాఖలు చేసిన వినతిని ధర్మాసనం విచారిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News