Wednesday, January 22, 2025

యుపిఎస్ విధానం మోసపూరితం

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయ, ఉద్యోగులను
వంచించేందుకే ఈ ఎత్తుగడ
సిపిఎస్‌ను రద్దు చేసి
పాత పెన్షన్
విధానాన్ని అమలు చేయాలి
వరంగల్‌లో జరిగిన ‘కాకతీ
కదనభేరి’లో వక్తల డిమాండ్
భారీగా తరలివచ్చిన ఉద్యోగులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఉపాధ్యాయ ఉద్యోగుల్ని మోసగించడానికే యుపిఎస్ విధానమని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా కేంద్ర ంగా ఇస్లామియా కాలేజీ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కందుల జీ వన్ కుమార్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కోశాధికారి ఈడిగి నరేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సభకు ఉద్యోగ ఉపాధ్యాయులు మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆగస్టు 24న కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన నిర్ణయం మేరకు ఏప్రిల్ 1 2025 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫై చేయనున్న ఏకీకృత పెన్షన్ విధానం (యూనిఫైడ్ పెన్ష న్ స్కీం)ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను రెండు దశాబ్దాలుగా పీడిస్తున్న సిపిఎస్ ను రద్దు పరచి పాత పెన్షన్ అమలు చేయాలని కాకతీయ కదనభేరి నిర్వహించినట్లు స్థిత ప్రజ్ఞ తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1న సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు నాడు సిపిఎస్ విధానం పట్ల వ్యతిరేక ప్రతిఘటన లేకపోవడం చే ఉద్యోగ ఉపాధ్యాయులకి అమలు చేయడం జరిగిందన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ విధానాల మార్పు అవకాశం ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు, వ్యవస్థీకృత సంఘాలు తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వానికి తెలియచేయందున సిపిఎస్ విధానాన్ని మళ్లీ అమలు పరిచారన్నారు. ఎన్‌పిఎస్ ట్రస్ట్‌తో చేసుకున్న అగ్రిమెంట్‌ను ఎగ్జిట్ కాలేకపోయామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్ 1 2025 రోజు మళ్ళీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ విధానానికి సంబంధించిన ఒక అవకాశం అనేది వస్తుందని, ఉద్యోగ ఉపాధ్యాయుల తీవ్రమైన ప్రతిఘటన ఉంటే సిపిఎస్ నుండి పాత పెన్షన్ విధానాల్లోకి మారేందుకు అవకాశం వస్తుందన్నారు. ఇటీ వల కేంద్ర మంత్రిమండలి ఆమోదం మేరకు ప్రవేశపెట్టనున్న యూనిఫైడ్ పెన్షన్ విధానంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల నుండి కంట్రిబ్యూషన్ రూ పంలో వసూలు చేసిన 10.5 లక్షల కోట్ల రూపాయల పెన్షన్ నిధులను అన్ని కూడా కార్పొరేట్ చేతుల్లోనికి వెళ్లనున్నాయన్నారు. రాజ్యాంగం ఆర్టికల్ 51 ద్వారా పౌరులకు కంట్రిబ్యూటన్ లేని పెన్షన్ ఒక హక్కుగా ఉందన్నారు.

పాత పెన్షన్ విధానంలో ఉద్యోగికి గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, డి.ఏ ఆధారిత సర్వీస్ పెన్షన్, కమ్యూటేషన్ సౌకర్యాలను కలిగి ఉంటుందని అదే యుపిఎస్ విధానంలో ఉద్యోగి,ప్రభుత్వ నెల వారి కాంట్రిబ్యూషన్ ద్వారా జమైన పెన్షన్ నిధిని ఎంపీఎస్ ట్రస్ట్ కు బదిలీ చేస్తే కానీ, సర్వీస్ పెన్షన్ నిర్ణయం జరగదని, ఇది తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అంశమని స్థిత ప్రజ్ఞ తెలిపారు. ఒక ఉద్యోగి తన పెన్షన్ తను నెలవారీగా తన సామాజిక భద్రతను కొనుక్కునే విధంగా, కార్పొరేట్ల కడుపు నింపే విధంగా ఈ పెన్షన్ విధానం ఉందని వ్యతిరేకించారు.

అధ్యాపక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంఎల్‌సి అభ్యర్థి కొలిపాక

ఎంఎల్‌సి అభ్యర్థి కొలిపాక వెంకట స్వామి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం, ఉపాధ్యాయ ,గురుకుల, మోడల్ స్కూల్ ,అధ్యాపక సమస్యల పరిష్కర దిశగా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ న్పీఎస్ విధానంలో రిటైర్ అయిన హైకోర్టు జడ్జి విశ్రాంతి న్యాయమూర్తులకు కేవలం 6 నుంచి 15 వేల రూపాయల పెన్షన్ అందుతుందని సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి పోయేలా ఈ నూతన పెన్షన్ విధానం ఉం దని,సామాజిక భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ల కడుపు నింపేలా తయారైయ్యాయని, పెన్షన్ కన్నా ఉద్యోగి కుటుంబానికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News