- Advertisement -
హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో సోనీ రాజీనామా చేసినట్లు సమాచారం. పదవీకాలం పూర్తికాక ముందే రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూకు తన రాజీనామా పత్రాన్ని ఆయన పంపారు. మనోజ్ పదవీ కాలం 2029లో ముగియాల్సి ఉండగా ఆయన ముందే రాజీనామా చేయడంతో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మనోజ్ 2017లో యుపిఎస్ సిలో సభ్యులుగా చేరారు. 16 మే 2023న ఆయన యుపిఎస్ సి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మూడుసార్లు వైస్ ఛాన్సలర్‌గా సేవలదించడంతో పాటు అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. సోనీ రాజీనామా అంశం ఐఎఎస్ పూజా ఖేద్కర్‌కు సంబంధంలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -