Friday, December 20, 2024

UPSC సివిల్స్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

UPSC(యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్) సివిల్స్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. UPSC ప్రిలిమ్స్, మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి మంగళవారం తుది ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 1143 ఖాళీలకు గాను 1016 మందిని యూపిఎస్సి ఎంపిక చేసింది. ఎంపికైనన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో పిడిఎఫ్ ఫార్మాట్ లో అందుబాటులో ఉంచింది.

ఈ ఫలితాల్లో ఆదిత్య శ్రీవాత్సవ మొదటి ర్యాంక్‌ సాధించగా.. అనిమేశ్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంక్‌, దోనూరు అనన్యారెడ్డికి మూడో ర్యాంక్‌,  పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ కు నాలుగో ర్యాంకు, రుహ‌నీకి ఐదో ర్యాంకు వచ్చాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారిలో జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో 347, ఈడ‌బ్ల్యూఎస్ 115, ఓబీసీ 303, ఎస్సీ 165, ఎస్టీ 86 మంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News